Nandyal

84,85,117 జీవోలను రద్దు చేయాలి – pdsu

84,85,117 జీవోలను రద్దు చేయాలి – pdsu

  • పాఠశాలలను, టీచర్ పోస్టులను కుదించే 84,85,117 జీవోలను రద్దు చేయాలని
  • ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల పై చర్యలు తీసుకోవాలి
  • అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ,భాష్యం, శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపుని వెంటనే  రద్దు చేయాలి
  • కార్పొరేట్, పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి
  • పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు S.M.D. రఫీ డిమాండ్

నంద్యాల పట్టణంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి కి వినతి

నంద్యాల 12 జూలై: పాఠశాల విద్యను ధ్వంసం చేసే, టీచర్ పోస్టులను కుదించే 84,85,117 జీఓలను వెంటనే రద్దు చేయాలని, ఖాలీగా ఉన్న 30వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, అమ్మఒడిని కోతల్లేకూండా విద్యార్థులందరికీ ఇవ్వాలని, ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు మెరుగు పరచాలని, ప్రైవేట్, కార్పోరేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, గుర్తింపు లేని ప్రైవేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని, 3,4,5 తరగతులను హై స్కూల్స్ లో విలీనం చేయడాన్ని ఆపాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (PDSU)  జిల్లా అధ్యక్షులు S.M.D.రఫీ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా  పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు S.M.D. రఫీ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విద్యార్ధి, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని (NEP) అమలు చేయక పోయినా రాష్ట్రంలో  జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ, పాఠశాలలను 6 రకాలుగా మార్చి వేసిందని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు దగ్గర తెచ్చిన 1850 కోట్ల రుణము కోసం పాఠశాలలను, టీచర్ పోస్టులను కుదిస్తుందని అన్నారు. 3,4,5 తరగతులను హై స్కూల్స్ లో విలీనం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 5200 ప్రాథమిక పాఠశాలలు రద్దు అయ్యాయని అన్నారు. UP స్కూల్స్ లో HM పోస్టును, 137 మంది కంటే విద్యార్ధులు తక్కువగా ఉండే హై స్కూల్స్ లో HM, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను రద్దు  చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 30వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే, ప్రభుత్వం వాటిని భర్తీ చేయకుండా మిగులు చూపించే కుట్ర చేస్తుందని విమర్శించారు. అమ్మఒడికి 90వేల మంది విద్యార్థులను దూరం చేసిందని దుయ్యబట్టారు పాఠశాలలు తెరిచి వారం రోజులు గడిచినా విద్యార్థులకు విద్యాకానుక కిట్లు సగం కూడా అందలేదని, పాఠ్య పుస్తకాలు లేకుండా చదువులు ఎట్లా సాగుతాయని ప్రశ్నించారు. మరోప్రక్క ప్రైవేట్, కార్పోరేట్ స్కూల్స్  ఒలింపియాడ్, ఇంటర్నేషనల్, టెక్నో వంటి ఆకర్షణీయమైన పేర్లతో విద్యార్థుల నుండి లక్షల రూపాయలు గుంజుతున్నాయని అన్నారు. గుర్తింపులేని, ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు. సమాంతరంగా తెలుగు, ఇంగ్లీష్, మైనర్ మాధ్యమాలను కొనసాగించాలని, ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను మెరుగు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU నంద్యాల పట్టణ కార్యదర్శి నవీన్, ఉపాధ్యక్షులు నాని, కళ్యాణ్ ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks