Nandyal

స్పందన అర్జీలను చట్ట పరిదిలో సత్వరమే పరిష్కరించండి – ఎస్పీ

స్పందన అర్జీలను చట్ట పరిదిలో సత్వరమే పరిష్కరించండి – ఎస్పీ

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం (11-07-2022)నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 81 ఫిర్యాదులను నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన  ఫిర్యాదిదారులతో జిల్లా ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి చట్ట పరిధిలో సమస్యలను సవరమే పరిష్కరించాలని ఆదేశించారు.

ఫిర్యాదులలో  కొన్ని

  1. నాకున్న ఆస్తిలో నలుగురు కుమారులకు సమానంగా పంచి తన జీవనానికి 10  ఎకరాలు ఉంచుకోగా దానిని కూడా బలవంతంగా లాక్కొని ఇంటి నుంచి గెంటి వేశారని ప్రస్తుతం YSR నగర్ లోని అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్నానని తనకు న్యాయం చేయాలని ఒండుట్ల గ్రామానికి చెందిన పెరుగు. లింకన్న ఫిర్యాదు చేశారు.
  2. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ లో 0.5 సెంట్ల స్థలాన్ని రామ్మోహన్ అనే వ్యక్తి  వేరొకరి స్థలాన్ని తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేయించి ఉద్దేశపూర్వకంగా మోసం చేసినాడు అని మేడం శివరాంరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
  3. ఉద్యోగం ఇప్పిస్తానని 04 లక్షలు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా మరియదాసు అనే వ్యక్తి మోసం చేసినాడు అని తిమ్మాపురానికి చెందిన p. రాజశేఖర్ ఫిర్యాదు చేశారు.
  4. జిల్లాలో పలు RCM చర్చిలలో వరుస దొంగతనాలు చేస్తున్నారని దానిపై తగిన చర్య తీసుకోవాలని (RCM )రోమన్ క్యాథలిక్ మిషన్ కు సంబంధించిన పాస్టర్స్ ఫిర్యాదు చేశారు.

ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ R. రమణ గారు పాల్గొన్నారు.

Syed Musthafa

Syed Musthafa, Senior Journalist, Nandyal Dist
Back to top button
Enable Notifications    OK No thanks