Nandyal

 సి ఎస్ ఐ   హెచ్ సి సి   పాస్టరేట్ 2  కమిటీ  ఎలక్షన్స్ లో బాలయ్య ప్యానల్ ఘన విజయం

 సి ఎస్ ఐ   హెచ్ సి సి   పాస్టరేట్ 2  కమిటీ  ఎలక్షన్స్ లో బాలయ్య ప్యానల్ ఘన విజయం

నంద్యాల (Nandyalonline.com)  నంద్యాల పట్టణంలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా హోలీ క్రాస్   క్యాథెడ్రిల్  పాస్టరేట్ 2  నంద్యాల  కమిటీ ఎలక్షన్స్ లో బాలయ్య ప్యానల్ ఘన విజయం సాధించినట్లు పాస్టరేట్  అధ్యక్షులు  రెవరెండ్ రత్న రాజు సామ్యూల్  తెలిపారు.   వారు మాట్లాడుతూ సి ఎస్ ఐ హోలీ క్రాస్ కాథెడ్రల్  పాస్టరేట్ 2 లో  త్రైమాసిక కమిటీ ఎలక్షన్స్ నిన్న ఆదివారం స్థానిక పెద్ద చర్చ్ కమ్యూనిటీ హాల్ లో జరిపినట్లు తెలిపారు ఈ కమిటీ ఎలక్షన్స్ లో ప్రధానంగా జిల్లెల బాలయ్య ప్యానెల్ మరియు జో మనోహర్ ప్యానల్ తలపడగా జై బాలయ్య ప్యానెల్ వారు 16  సభ్యులకు గాను పూర్తిగా 16 అభ్యర్థులు గెలుపొంది జో మనోహర్ ప్యానల్ పై పూర్తిస్థాయి విజయాన్ని కైవసం చేసినట్లు తెలిపారు అనంతరం పాస్టరేట్  2  సెక్రటరీ జై బాలయ్య మాట్లాడుతూ ఈ త్రైమాసిక   కమిటీ ఎన్నికల్లో  విజయం సాధించినందుకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని తెలిపారు.  గెలుపొందిన ప్రతి కమిటీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కమిటీ పదవీకాలం 2022-2025  వరకు కొనసాగుతుందని  తెలిపారు.  ఈ ఎన్నికలు సజావుగా కొనుటకు సహకరించిన నంద్యాల డయాసిస్ అధ్యక్షులు ది రైట్ రెవరెండ్  డాక్టర్ పుష్ప లలిత కు  మూడో పట్టణ పోలీస్ వారికి కమిటీ సభ్యులకు గురువులకు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks