Sirvel

సిరివెళ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్.పి

సిరివెళ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్.పి

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీరా రెడ్డి పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తనిఖీలలో భాగంగా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లోని సిరివెళ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిరివెళ్ల పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు.సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశిస్తూ ఫిర్యాదిదారుల పుస్తకాన్ని పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. లాంగ్ పెండింగ్ ప్రాపర్టీ కేసులు  (రాబరీ, డకాయిట్)వివరాలు తెలుసుకొని వాటికి సంబంధించిన ముద్దాయిలు ఎవరో కనిపెట్టి విచారణ జరిపి దర్యాప్తు త్వరితగతిన ముగించి ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యాలని అధికారులను  ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని ,వారి రక్షణ కొరకు  ప్రవేశపెట్టిన దిశ యాప్ పట్ల అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. నాటుసారా తయారీ,రవాణా ,విక్రయాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని సారా తయారీకి కావలసిన బెల్లం విక్రయదారుల పై ప్రత్యేక నిఘా ఉంచాలని  అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మట్కా,జూదం , క్రికెట్ బెట్టింగ్, గుట్కా మొదలగు అసాంఘిక కార్యకలాపాలఫై   ప్రత్యేక నిఘా  ఉంచి పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల పై  ప్రత్యేక దృష్టి ఉంచాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు (సిగ్నల్స్)ఏర్పాటు చేయాలని, ప్రమాదాల  నివారణకు కావలసిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి అదృశ్యమైన వారి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలన్నారు. సిబ్బంది యొక్క వ్యక్తిగత మరియు ఉద్యోగ సంబంధిత సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks