
శాంతియుత వాతావరణంలో బక్రీద్ మరియు తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలి – జిల్లా ఎస్పీ
శాంతియుత వాతావరణంలో బక్రీద్ మరియు తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలి – జిల్లా ఎస్పీ
నంద్యాల (NandyalOnline.com) 09 జూలై: బక్రీద్ పండుగ మరియు తోలి ఏకాదశీ పండుగ పర్వదినాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి IPS నంద్యాల జిల్లా ముస్లిం సోదరులకు మరియు హిందు సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నీ మతాలు ఒక్కటేనని ఒకరి మనోభావాలను ఒకరు గౌరవించుకుంటు సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. అందరూ ఐక్యమత్యంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా మిత్ర భావంతో ప్రేమను పంచుకుంటూ పండుగ జరుపుకోవాలనీ ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులు, ప్రార్ధన మందిరాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందిగా నిర్వహించడం జరుగతుందన్నారు. 24 గంటలు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రత్యేకంగాను, సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులపై జిల్లా పోలీస్ శాఖ గట్టి నిఘా ఉంచిందని ఆకతాయి చేష్టలతో సోషల్ మీడియాలో వదంతులను ఉద్దేశిపూర్వకంగా సృష్టిస్తే వారిని ఉపేక్షించే లేదని హెచ్చరించారు. సర్వ మతాలతొ సమ్మేళన మైన భారతావనిలో ప్రజలందరు ఒక ఆధ్యాత్మిక భావంతో పండుగలను జరుపుకోవాలని ఎలాంటి అలజడులకు తావు లేకుండా సోదర భావంతో ఉండాలని, భిన్న భావాలు మన చుట్టూ ఉన్నప్పటికీ సోదర భావంతో ఎలాంటి ఘటనలకు తావు ఇవ్వకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము ఇదే స్పూర్తిని కొనసాగిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. కరోనా ఫోర్త్ వే సమస్య కూడా ఉన్నందున ప్రార్థనలకు వెళ్ళు సోదరులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. పార్కింగ్ కొరకు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలలో తమ వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసి ఇతర వాహనదారులకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా చూడాలని కోరారు.