Sirvel

విద్యార్థులు జీవితానికి యమపాశంగా మారిన జీవో నెంబర్ 117 ను తక్షణమే రద్దు చేయాలి

  • విద్యార్థులు జీవితానికి యమపాశంగా మారిన జీవో నెంబర్ 117 ను తక్షణమే రద్దు చేయాలి
  • విలీనం పేరుతో విద్యార్థుల చదువులను అంధకారంలోకి నెట్టొద్దు
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడ్డ నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ (NSF) జిల్లా అధ్యక్షుడు డి. చిన్న

సిరివెళ్ల మండలం లోని మహాదేవపురం గ్రామం లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉన్న మూడు నాలుగు ఐదు తరగతులను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడానికి వ్యతిరేకిస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాఠశాల చైర్మన్ లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ (NSF) జిల్లా అధ్యక్షుడు డి.చిన్నా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల వారికి చదువు అంటే అందని ద్రాక్షగా చేయాలనే నేపంతో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తే ఆ జీవోను తీరస్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే అమలు పరచడంలో అంతర్యం ఏమిటని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చిన 117 జీవో కేవలం ప్రైవేట్ కార్పొరేట్  విద్యాసంస్థలు తమ జోబులు నింపుకోవడానికే తప్ప విద్యార్థుల భవిష్యత్తుకు నాంది కాదని ఆయన మండిపడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయకుండా ఈ విధంగా పాఠశాలలు విలీనాలు చేస్తే కొత్తగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయరనే విషయం అందరికీ తెలుస్తుంది. పాఠశాలలో విలీనాలు జరిగితే చదువుకునే విద్యార్థుల సంఖ్య అమాంతంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మహాదేవపురం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వెళ్లాలంటే గాజులపల్లి నుండి చాగలమర్రి వెళ్లే హైవే రోడ్డులో వెళ్లాల్సిన పరిస్థితి అదే విధంగా అదే మార్గంలో వక్కిలేరు వంక బ్రిడ్జి దాటవలసిన పరిస్థితి నెలకొంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లే క్రమంలో రోడ్డుపై వెళ్లే వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలతో వక్కిలేరు వాగు కొండల నుంచి వచ్చే వరద నీరుతో ఉదృతంగా ప్రవహిస్తుంది అటువంటి సమయాల్లో విద్యార్థులకు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇటువంటి ప్రమాదాల అంచుల నుంచి చదువుకోవాల్సిన పరిస్థితి  విద్యార్థులకు దాపరించిందని ఆయన మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం నాడు నేడు కింద ఒక్కో పాఠశాలకు లక్షల రూపంలో నిధులు మంజూరు చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి నేడు సౌకర్యాలు కల్పించిన పాఠశాలలనే మూసి వేసే ప్రయత్నం చేస్తుందని తెలుపుతూ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు నేడు కింద నిధులు మంజూరు చేసి ఆ పాఠశాలలో పనులు జరుగుతూ ఉండడంతో ఆ పాఠశాలలో మొత్తం విద్యార్థులు కూర్చోవడానికి స్థలం లేకుంటే మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులను ఎక్కడ కూర్చోబెడతారని వారికి ఎవరు విద్య బోధిస్తారని ఆయన హెచ్చరించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకముందే 117 జీవోను తక్షణమే రద్దు చేసే విధంగా స్థానిక  ఎమ్మెల్యే(MLA) వారు కూడా విద్యార్థులకు భవిష్యత్ కు తోడ్పడాలని ఆయన కోరారు లేని పక్షంలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల చైర్మన్ నాగేంద్ర ,విద్యార్థుల తల్లిదండ్రులు రఫీ ,మధు ,వెంకటాద్రి, నరసింహ ,వెంకటదాసు, పాఠశాల విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications    OK No thanks