Nandyal

విఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయ పులికొండన్నతో సమావేశమైన చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి

విఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయ పులికొండన్నతో సమావేశమైన చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి

నంద్యాల (NandyalOnline.com) శుక్రవారం ఉదయం నంద్యాలలో ఉన్న వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయ పులికొండన్న ని ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా బోయ పులికొండన్న మాట్లాడుతూ వాల్మీకి st పునరుద్ధరణ అంశాన్ని అదోనిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారని ఇప్పటికే మూడు సంవత్సరాలు అయిపోయిందని కేవలం రెండు సంవత్సరాలు మిగిలిందని ఈ కాలంలో సీఎం మరియు ఎంపీలు ఢిల్లీ వెళ్లేలా పార్టీలో ఉన్న వాల్మీకి నాయకులంతా పార్టీ పై  ప్లీనరీలో వత్తిడి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు, అందుకు స్పందనగా విరూపాక్షి మాట్లాడుతూ అదోనిలో నేను, కార్పోరేషన్ చైర్మన్ మధుసూదన్ మరియు స్థానిక ఎమ్మెల్యే కలిసి సీఎంకి వివరించామని కచ్చితంగా వాల్మీకి జాతికి న్యాయం జరిగేలా అందరం కలిసి కృషి చేస్తామని చెప్పారు ఈ సమావేశంలో నంద్యాల పార్లమెంట్ విఆర్పీఎస్ గౌరవాద్యక్షులు మరియు కాంట్రాక్టర్ గుర్రప్ప,నంద్యాలపట్టణ విఆర్పీఎస్ యూత్ అధ్యక్షులు పరమేష్,ఉపాధ్యక్షులు రమేష్, కార్యదర్సులు మధు, మల్లికార్జున, ఆలూరు నియోజక వర్గ విఆర్పీఎస్ నాయకులు లోకనాధ్, నాయకులు నాగప్ప, ఓబులేసు, వెంకటేష్, కోనేటి సిద్ధప్ప, సతీష్, రామాంజనేయులు, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications    OK No thanks