Nandyal

వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

  • వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
  • మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి -AISF
  • స్థానికంగా లేని హాస్టల్ వార్డెన్లను సస్పెండ్ చేయాలి
  • స్పందనలో నంద్యాల జిల్లా కలెక్టర్కి పిర్యాదు చేసిన AISF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, ధనుంజయుడు

నంద్యాల 12 జూలై: జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ లలో విద్యార్థులకు  మౌలిక వసతులు కల్పించాలని, మెనూ ప్రకారం భోజన సదుపాయం కల్పించాలని, విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా స్థానికంగా వార్డెన్స్ ఉండాలని స్థానికంగా లేని వార్డెన్ లపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం శ్రీనివాసులు, ఏ.ధనుంజయుడు లు నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామున్ ను కోరారు. స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి AISF జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం ఆయన నేపథ్యంలో సాంఘిక సంక్షేమ ఎస్సీ,ఎస్టీ,బీసీ హాస్టల్ లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి మెనూ ప్రకారం నాణ్యమైనటువంటి భోజన వసతి కల్పించాలని వారు అన్నారు. జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో వసతి గృహ సంక్షేమ అధికారులు విద్యార్థులకు అందుబాటులో లేకుండా ఇష్టానుసారంగా విధులకు హాజరవుతు, చుట్టం చూపులాగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒక సారి వచ్చి ఒక గంట ఉంటూ తమ సొంత పనులకు కేటాయించినటువంటి సమయం హాస్టల్లో విద్యార్థులకు ఇవ్వడం లేదని వారు అన్నారు. కావున జిల్లాలో అటువంటి వార్డెన్లపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ హాస్టలను తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో AISF నంద్యాల పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి మనోహర్, AISF నాయకులు హరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks