Nandyal

వక్ఫ్ బోర్డ్ స్థలాలను కబ్జా చేసిన వారిపై క్రిమినల్  కేసులు నమోదు చేయాలి

వక్ఫ్ బోర్డ్ స్థలాలను కబ్జా చేసిన వారిపై క్రిమినల్  కేసులు నమోదు చేయాలి – బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం

శిరివెళ్ల  మండలంలో వక్ఫ్ బోర్డ్ స్థలాలను కబ్జా చేసిన వారిపై క్రిమినల్  కేసులు నమోదు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని శ్యామూన్ కి వినతిపత్రం అందజేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి. రామచంద్రుడు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్.  ఈ సందర్భంగా  బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి. రామచంద్రుడు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ మాట్లాడుతూ శిరివెళ్ల మండలంలో వున్న వక్ఫ్ బోర్డ్  భూములను అనేక మంది అక్రమార్కులు అక్రమించుకుంటున్నారని, స్థానిక నాయకుల అండ దండలతో కొంతమంది  స్థానిక  నాయకులు  వక్ఫ్ బోర్డ్ భూములను ఆక్రమిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలసిన  జిల్లా వక్ఫ్ బోర్డ్ అధికారులు,మరియు మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, కాసులుకు కక్కుర్తి పడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారి వద్ద నుంచి తాయిలాలు తీసుకుంటూ వక్ఫ్ బోర్డ్ స్థలాలు కబ్జా చేస్తున్న వారికి వత్తాసు పలుకుతున్నారని, ఎవరైతే శిరివేళ్ల లో వక్ఫ్ బోర్డ్ స్థలాలను అక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అదే విధంగా వారికి సహకరిస్తున్న జిల్లా వక్ఫ్ బోర్డ్ అధికారి, మైనారిటీ వెల్ఫేర్ అధికారి, లపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా అక్రమాలకు సహకరిస్తున్న సిరివేళ్ల మండల రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని వారు జిల్లా కలెక్టర్ కి విన్నవించారు, స్పందించిన జిల్లా కలెక్టర్ వక్ఫ్ బోర్డ్ భూములపై విచారణ ఏర్పాటు చేస్తామని, వక్ఫ్ బోర్డ్ భూములలో ఎటువంటి కట్టడాలు చెప్పటిన కూడా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు

Ramachandraiah

Ramachandraiah, JSR News, Nandyal, Dist
Back to top button
Enable Notifications OK No thanks