Nandyal

రెండవ దశ సీనియర్ ఫెన్సింగ్ ఎంపిక పోటీలు

రెండవ దశ సీనియర్ ఫెన్సింగ్ ఎంపిక పోటీలు

నంద్యాల (NandyalOnline.com) 09 జూలై: స్థానిక నంద్యాల ప్రాంతంలోని పద్మావతి నగర్ స్టేడియం నందు ఉమ్మడి జిల్లాలు, జిల్లా స్థాయి పురుషులు మరియు మహిళల SAAP లీగ్ రెండవ దశ సీనియర్ ఫెన్సింగ్ ఎంపిక పోటీలు డిస్టిక్ స్పోర్ట్స్ ఆథారిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నంద్యాల్ జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు పాల్గోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ జావెద్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ క్వార్టర్ సెక్రెటరీ సురేష్ నాయుడు కార్యక్రమంలో పాల్గోని ఫెన్సెంగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సెలక్షన్ ఎంపిక పోటీలకు గాను అనంతపూర్ జిల్లా పెన్సింగ కోచ్ రవీంద్రనాథ్ ఈ క్రీడా పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగింది. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15, 16 వ తేదిన కర్నూల్ లో జరిగే రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫెన్సింగ్ క్రీడాకారులు మణికంఠ, శేఖర్, కార్తీక్, మోహన్, నాయుడు, లక్ష్మి, వెంకట్ మరియు క్రీడాకారులు క్రీడాకారునిలు పాల్గోన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks