
రుద్రవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పి
రుద్రవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పి
నంద్యాల (Nandyalonline.com) నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐ.పి.ఎస్ ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లోని రుద్రవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న పలు రికార్డులను పరిశీలించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిష్కారాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, చట్ట పరిధిలో వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడ రాజీ లేకుండా పని చేయాలని ఆదేశించారు. మరియు స్టేషన్ లో ఉన్న వాహనాలు ఏ కేసులలో పట్టుబడ్డాయి వాటికి సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి త్వరగా పరిష్కరించాలని రుద్రవరం ఎస్సై నిరంజన్ రెడ్డి గారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.