Nandyal

రజకులను ఎస్సీలుగా కేంద్రమే గుర్తించాలి

  • రజకులను ఎస్సీలుగా కేంద్రమే గుర్తించాలి
  • నందవరం శ్రీనివాసులు రజక, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ  రజక ఎస్సీ సాధన చైతన్య సమితి.

 

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 24 జూలై: రాష్ట్రంలో బీసీలు గా వున్న రజకులను ఎస్సీలుగా కేంద్రప్రభుత్వమే గుర్తించాలని ఏపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు  డిమాండ్ చేశారు. దేశంలో 17కేంద్రపాలిత ప్రాంతాలలో రజకులు ఎస్సీలుగా జీవనం సాగిస్తున్నా, కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రజకులు బీసీలుగా అన్నివిధాలుగా వెనుక బడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని స్థానిక  R&B గెస్ట్ హౌస్ లో ఎపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి ఆధ్వర్యంలో ” రజకుల అభివృద్ది సంక్షెమం ” అంశం పై సమావేశాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వి రమణ అధ్యక్షతన నిర్వహించారు.ఈసందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో రజకులు బీసీలుగా ఎన్నో అవమానాలు, దాడులు, భహిష్కరణలు, కష్టాలు ఎదుర్కొంటున్నారని, రాజకీయ నాయకులు రజకుల ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ, వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారని, అధికారంలోకి వచ్చాక  ఏరు ఇవతల యంగన్న ఏరు దాటాక పింగన్న అన్న సామెతగా పాలకులు రజకులపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వాలకు  రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ఎన్ని సార్లు వినతి పత్రాలను అందజేసినా, నిర్లక్ష్యం గా వ్యహరిస్తున్నాయని తెలిపారు.  అంతేకాకుండ ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్ర బాబు నాయుడు గాని, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గాని ఎక్కడా కూడా రజకుల గురించి మాట్లాకుండా పోవడం దారుణమని,అసలు  రజకుల సంక్షేమం పై రాజకీయ పార్టీలకు చిత్త శుద్ధి వుందా అని ప్రశ్నించారు. భారత దేశంలో 17 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎస్సీలుగా ఉంటే, ఈనాటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రజకులను ఎస్సీ లుగా గుర్తించక పోవడం దురదృష్టకరమని అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటే అంతా  కేంద్రం చేతుల్లోనే ఉందని ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి, కేంద్రప్రభుత్వమే నేరుగా రజకులను ఎస్సీలుగా గుర్తించి, రజకుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఆమలు చేయడం కోసం సుప్రీం కోర్టుకు అప్పీలు చేయాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రజక సంఘం నాయకులు ఏ.పి వెంకటేశ్వర్లు, వెంకటాద్రి, అమ్మడాల రమణ, నాగరాజు, భూలక్ష్మి, లింగమ్మ, రుద్రవరం ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks