Nandyal

రక్షించాల్సిన వారే దాడులు చేస్తే ఎలా?

రక్షించాల్సిన వారే దాడులు చేస్తే ఎలా?

  • వేమూరు ఎస్సై  అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి నంద్యాల ముస్లిం జేఏసీ

నంద్యాల (నంద్యాల ఆన్లైన్) 07 జూలై: బాపట్ల జిల్లా వేమూరు ఎస్సై అనిల్ కుమార్ మహమ్మద్ రఫీ అనే యువకుడిని విచారణ పేరు తో స్టేషన్ కు పిలిచి విచక్షణా రహితంగా చితకబాది  కత్తి తో దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ అబ్దుల్ సమద్ తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ అబ్దుల్ సమద్ నాయకులు గన్ని కరీం సుహైల్ రానా మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు ఆపరామైన నమ్మకం విశ్వాసం ఉందని కానీ కొంత మంది కింది స్థాయి అధికారులు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తూ   రక్షించాల్సిన వారే దాడులు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగిన చిన్న వివాదాన్ని పరిష్కరించాల్సిన ఎస్సై అనిల్ కుమార్ రఫీ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి రఫీ వచ్చి రాగానే ఒక్క నిముషం కూడ ఆలస్యం చేయకుండా అతని మీద విచక్షణ రహితంగా డాడీ చేయడమే కాకుండా తల పట్టుకొని గోడకు బలంగా గుద్దడం  అంతటితో ఆగకుండా. కత్తి తీసుకోని తలమీద కోయడం ఎంత వరకు సమంజసమన్నారు. రఫీ తప్పు చేసి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప దాడి చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర డీజీపీ మరియు బాపట్ల ఎస్పీ స్పందించి ఎస్సై అనిల్ కుమార్ ను పై హత్య యత్నం కేసులు నమోదు చేసి శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గన్ని హాబీబ్. మస్తాన్ ఖాన్.మహబూబ్ బాషా పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks