Nandyal

మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని  ఆవాజ్ కమిటీ కాంగ్రెస్ సేవాదళ్ డిమాండ్ 

మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని  ఆవాజ్ కమిటీ కాంగ్రెస్ సేవాదళ్ డిమాండ్

నంద్యాల 13 జూలై: మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని  ఆవాజ్ కమిటీ కాంగ్రెస్ సేవాదళ్ డిమాండ్ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు వేతనాలు పెంచాలని రెగ్యులర్ చేయాలని గ్రాడ్యుటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల నుండి సమ్మె చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కలగజేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఊకదంబుడిపందాలు ఇస్తున్నారు. కానీ నేడు మున్సిపాలిటీలో అత్యధికంగా దళితులు బీసీలు పనిచేస్తున్నారు వారికి వేతనాలు 21000 పెంచమంటే మా ప్రభుత్వము 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుతామని మున్సిపల్ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి చెప్పడం దుర్మార్గమైన చర్య అని అంతవరకు ధరలు పెరిగిన అర్థ ఆకలితో మీ ప్రభుత్వానికి ఊడిగం చేయాల్నా మీరు అధికారంలోకి వచ్చే ముందు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు రెగ్యులర్ చేస్తామని చెప్పినారు నేటికీ మూడు సంవత్సరాలు అవుతుంది అయినా రెగ్యులర్ చేయలేదు సమాన పనికి సమాన వేతనం అమలు చేయలేదు అందుకే సమ్మె చేస్తున్నావని కార్మికులు మొరపెట్టుకున్న హై పవర్ కమిటీ నియమిస్తున్నాము పరిష్కరిస్తుందని చెప్పడము అన్యాయమని వీరి సమ్మె వల్ల రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లో చెత్త పెరిగిపోయి కాలువలు నిండిపోయి దుర్వాసనతో ప్రజల జీవించే టందుకు బాధపడుతున్నారు జబ్బులు దోమలు పెరిగిపోయి ప్రజలు పిల్లలు ముసలి వాళ్లు జబ్బులతో సతమతో ఉన్న ప్రజారోగ్యాన్ని కాపాడుతామని చెప్పే మీ ప్రభుత్వము నేటి వరకు ఆ పరిష్కార దిశలో లేదని ఇప్పటి కైనా మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆవర్ జిల్లా కన్వీనర్ పట్టణ పౌరుల సమాఖ్య జిల్లా కార్యదర్శి మస్తాన్వలి కాంగ్రెస్ సేవ దళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ డిమాండ్ చేశారు అలాగే అంగన్వాడి వర్కర్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటి ఇవ్వాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని ధరలు పెరిగిపోతున్నాయి వంట గ్యాస్ రేట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి జీవించడం కష్టంగా ఉందని ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు రాష్ట్రంలో మా చెల్లెమ్మలు అక్కగారు అవ్వగారు ఎవరు బాధపడకూడదని ముసలి కన్నీరు కారుస్తూ మరొకవైపు వారి కడుపులు కాల్చుతున్నారని మస్తాన్వలి మస్తాన్ ఖాన్ తెలిపారు ఇప్పటికైనా వారికి సత్యాపత్కాల అందడం లేదని గర్భిణీలకు చిన్న పిల్లల తండ్రులకు తల్లులకు చిన్న పిల్లలకు సేవ చేస్తున్న అంగన్వాడి వర్కర్ల న్యాయమైన కోర్కెలను ఏమాత్రం మహిళలపై జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆవాజ్ జిల్లా కన్వీనర్ పట్టణ పౌరుల సమాఖ్య జిల్లా కార్యదర్శి మస్తాన్వలి కాంగ్రెస్ సేవల రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ డిమాండ్ చేశారు నంద్యాల పట్టణ ప్రాంతంలో ఉన్న చెత్త వలన మురికి కూపాల్ పెరిగిపోయినాయి ప్రజల జబ్బులతో ఆందోళన చెందుతున్నారు కావున ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్స్ కమిషనర్లు తక్షణము పట్టణ  ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజారోగ్యాన్ని కాపాడాలని నిన్న బక్రీద్ పండగ నేడు గురు పౌర్ణమితో నంద్యాల పట్టణంలో ప్రజలందరూ తమ ప్రార్థన మందిరాలకు వెళ్లడానికి కూడా కష్టంగా ఉందని ఇది స్థానిక కౌన్సిలర్లు గమనంలో ఉంచుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని పై నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారికి ఐదేళ్లు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారికి పెన్షన్ సౌకర్యం ఉంది ఫ్యామిలీ పెన్షన్ ఉంది కానీ సంవత్సరాల తరబడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు గాని అంగన్వాడి వర్కర్లకు గాని కాంటాక్ట్ వర్కర్స్ గాని పెన్షన్ సౌకర్యం లేదని వెంటనే వారందరికీ పెన్షన్ సౌకర్యం ఓపిఎస్ పెన్షన్ అమలు చేయాలని ఆవ జిల్లా కన్వీనర్ పట్టణపారుల సమాఖ్య కార్యదర్శి ఎస్ మస్తాన్వలి కాంగ్రెస్ సేవల రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks