Nandyal

మానసిక పిల్లలకు అన్నప్రసాద వితరణ

మానసిక పిల్లలకు అన్నప్రసాద వితరణ

నంద్యాల (nandyalonline.com) 23 జూలై: కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపకులు సముద్రాల వెంకటనారాయణ శెట్టి జ్ఞాపకార్థం ఈ రోజు నంద్యాల ఉషా మనోవికాస్ కేంద్రంలోని మానసిక పిల్లలకు నంద్యాలలోని బైరమల్ స్ట్రీట్  బ్రాంచ్ మేనేజర్ గుంటూరు నాగరాజు మరియు సిబ్బంది కలిసి ఈ మానసిక పిల్లలకు మంచి రుచికరమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమం, పండ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ సీఈవో CV కృష్ణమూర్తి మాట్లాడుతూ 52 సంవత్సరముల నుండి వ్యవస్థాపకులైన కోయిలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ కి చైర్మెన్ గా ఉంటూ అన్ని రకాలుగా ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తూ, బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడినటువంటి  సముద్రాల వెంకట నారాయణ శెట్టి గారి జ్ఞాపకార్థం ఉషా మనోవికాస కేంద్రం లోని పిల్లలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం  అని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ నంద్యాల బైరమల్ స్ట్రీట్ బ్రాంచ్ మేనేజర్ గుంటూరి  నాగరాజు మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks