Nandyal

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  73వ జయంతి వేడుకలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  73వ జయంతి వేడుకలు

నంద్యాల (NandyalOnline.com) 08 జూలై: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  73వ జయంతి నంద్యాల కాంగ్రెస్ కార్యాలయంలో దాసరి చింతలయ్య వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా  చింతలయ్య, వాసు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు గురించి ఈ విధంగా అభివర్ణించారు.  చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రజల స్థితి గతులను గమనించి రాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 14వ  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ముఖ్యమంత్రి  హోదాలో ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగింది. రైతులకు ఉచిత విద్యుత్ పథకం,  విద్యార్థులకు ఫీజురిమెంబర్ మెంట్, ప్రజల ఆరోగ్యం కొరకు ఆరోగ్యశ్రీ  108,104. అర్హులైన పేదలందరికీ పింఛన్ పంపిణీ వ్యవస్థ.  ముస్లింలకు 4 పర్సెంట్ రిజర్వేషన.ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గృహకల్ప  మతసామరస్యంగా గవర్నమెంట్ నడిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికై  నిరంతరం కృషి చేసే వ్యక్తి, జనహృదయ నేత,రైతు బాంధవుడు,పేదల పెన్నిధి,వ్యవసాయాన్ని పండుగగా మార్చిన రైతు నేస్తం దివంగత మహానేత డా|| వైయస్ రాజశేఖర రెడ్డి గారి 73 వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు కాంగ్రెస్ కార్యాలయము నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో నంద్యాల టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, అధికార ప్రతినిధి ఊ కొట్టు వాసు, ఉపాధ్యక్షుడు శివరామిరెడ్డి, ఆనందరావు,వెంకటసుబ్బయ్య, సెక్రటరీ  రెహమాన్, Syd ప్రసాద్, కిసాన్ సెల్ అధ్యక్షుడు బి శివారెడ్డి, మొదలగు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు..

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications    OK No thanks