
Banaganapalli
మహిళపై పీడీ యాక్ట్ నమోదు
మహిళపై పీడీ యాక్ట్ నమోదు
బనగానపల్లె (NandyalOnline.com) 09 జూలై: జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు బనగానపల్లె పట్టణానికి చెందిన తెలుగు సుంకమ్మ అనే మహిళను పీడీ చట్టం (నేర నిరోధక చట్టం)కింద కేసు నమోదు చేసినట్లు బనగానపల్లె ఎస్సై రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. పట్టణంలోని భానుముక్కల వీధికి తెలుగు సుంకమ్మ పై గతంలో పలుమార్లు కేసులు ఉండడంతో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈమెను అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.