Nandyal

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా టీ ప్రతాప్ ఏకగ్రీవ ఎన్నిక

  • బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా టీ ప్రతాప్ ఏకగ్రీవ ఎన్నిక
  • బీసీలు రాజకీపార్టీలకు అతీతంగా పోరాటం చేయాలి
  • ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,ఎం.రవికుమార్

నంద్యాల జిల్లా (NandyalOnline.com) 09 జూలై: ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా టి ప్రతాప్ ను రాష్ట్ర అధ్యక్షుడు  ఎం రవికుమార్ యాదవ్ సమక్షం లో  మండల తహసిల్దార్ కార్యాలయం వెనుక ఉన్న నిశాంతి భవనం నందు నందవరం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన బీసీ సమావేశంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఏం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో బీసీలందరూ ఐకమత్యంతో ఏకం కావాలని పేర్కొన్నారు బీసీలకు రాజ్యాధికారాన్ని సాధించుకోవాలన్నా అభివృద్ధి చెందాలన్నా రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమించినప్పుడే బీసీలకు నిజమైన రాజ్యాధికారం వస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ప్రస్తుత రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తూ కేవలం బీసీల ఓటు బ్యాంకు కోసం బీసీల జపం చేస్తూమోసం చేస్తున్నాయని విమర్శించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు బీసీలకు రాజకీయంగా 35% శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా కూడా అమలు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో బీసీలందరూ రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల్సి అవసరం ఉందని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ యాదవ్ ఎం సురేంద్ర నాయుడు జిల్లెల్ల శ్రీరాములు అయ్యన్న యాదవ్ టిజి శ్రీనివాసులు సిపిఐ ఎంఎల్ నాయకుడు వెంకటేశ్వర్లు దూదేకుల నాగరాజు ఎంవి రమణ భాష్యం వెంకటేశ్వర్లు గౌడ్ కే వెంకటేశ్వర్లు వడ్డే వెంకటేష్ వడ్డే రాజారాం తదితరులు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks