
Nandyal
బదిలీ ఉద్యోగులకు ఘన సన్మానం
బదిలీ ఉద్యోగులకు ఘన సన్మానం
నంద్యాల జిల్లా మహానంది మండలంలో పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ అయిన అధికారులను ఘనంగా సన్మానించారు. బుధవారం సాయంత్రం మహానందిలోని రమణ కళ్యాణ మండపంలో మహానంది దేవస్థాన చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అధికారులు పాల్గొని బదిలీ అయిన ఎంపీడీవో సుబ్బరాజు, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డి, మురళీకృష్ణ నాయక్, నాగేంద్ర లను ఘనంగా సన్మానించారు.