
Nandyal
బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించుకుందాం – సమద్
బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించుకుందాం – సమద్
నంద్యాల (NandyalOnline.com) 09 జూలై: ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం బక్రీద్ పండుగా శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఇది త్యాగాల ప్రతీక అని జమాఆతె ఇస్లామి హింద్ నంద్యాల అధ్యక్షులు మరియు ముస్లిం జేఎసి ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ సమద్ ముస్లిం సమాజానికి అభ్యర్ధించారు. నంద్యాల నగరంలో పరంపరగా వస్తున్న శాంతియుత వాతావరణం కొనసాగించుట మన బాధ్యత. పండుగ వేళ పారిశుధ్ధ్యాన్ని విధిగా పాటించాలని, దేశంలో సోదరి భావం వెల్లివిరియాలని పండుగ సంధర్భంగా ప్రార్థించాలి అని సమద్ కోరారు. వర్షం వల్ల ప్రమాదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కరెంటు స్తంభాల వద్ద పిల్లలు వెళ్ళకుండా, విహారయాత్రలంటు బయట వెళ్ళె ప్రయత్నాలు వారించాలి అని ఆయన తెలిపారు.