Nandyal

ప్లీనరీ సమావేశాల్లో ప్రత్యేక హోదా పైన రాష్ట్ర అభివృద్ధి పైన దుల్హన్ పథకం పైన చర్చించకపోవడం రాష్ట్ర ప్రజలకు మైనార్టీలకు మోసం చేయడమే – మస్తాన్

ప్లీనరీ సమావేశాల్లో ప్రత్యేక హోదా పైన రాష్ట్ర అభివృద్ధి పైన దుల్హన్ పథకం పైన చర్చించకపోవడం రాష్ట్ర ప్రజలకు మైనార్టీలకు మోసం చేయడమే – మస్తాన్

నంద్యాల 10 జూలై: వైఎస్ఆర్సిపి ప్లీనరీ సమావేశాల్లో ప్రత్యేక హోదా పైన రాష్ట్ర అభివృద్ధి పైన దుల్హన్ పథకం పైన చర్చించకపోవడం రాష్ట్ర ప్రజలకు మైనార్టీలకు మోసం చేయడమేనని కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్లీనరీ  సమావేశాల్లో దుష్ట చతుష్టం పేరుతో ప్రతిపక్షాల విమర్శించడం పొగడ్తలతో వారి సంక్షేమ పథకాలను గురించి చర్చించారు తప్ప కేంద్రము రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఇస్తారని కడప ఉక్కు ఫ్యాక్టరీ నిధులు పోలవరం ప్రాజెక్టుకు నిధులు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిధులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ  ఓడరేవుల ప్రైవేటీకరణ విద్య వైద్య రంగాల అభివృద్ధికి నిధులు శాసనసభ నిర్మాణం నిధులు ఇవ్వని కేంద్రం పైన పోరాటాలు చేస్తామని పిలుపు ఇవ్వకపోవడం అలాగే వారి మేనిఫెస్టోలో భగవద్గీత కురాన్ బైబిల్ సాక్షిగా విశాఖలో జరిగిన ముస్లిం సోదరుల సమావేశంలో ప్రతి ముస్లిం చెల్లెమ్మకు వైఎస్ఆర్ పెళ్లి కానుకగా లక్ష రూపాయలు ఇస్తానని ఇవ్వకపోవడం బిసి, ఎస్సీ, ఎస్టీలకు కూడా క్రిస్టియన్ మైనార్టీలకు వైఎస్ఆర్ పెళ్లి కానుక ఇస్తారని ఇవ్వకపోవడం మాట తప్పి మడమ తిప్పి నట్లు వారన్నారు అన్నారు. అలాగే మూడు నాలుగు ఐదో తరగతి విద్యార్థులు ఇతర ప్రాంత స్కూళ్లలో చదువుకోడానికి వ్యతిరేకిస్తూ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే చెవిటి వాని ముందు శంకు ఊదినట్లే ఉందని అమ్మ ఒడి పథకము ఇస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని విషయం గమనించాలని మస్తాన్ ఖాన్ మస్తాన్వలి తెలిపారు ఎన్నికలు గెలుపొందిన వెంటనే వారం లోపల సిపిఎస్ రద్దు చేస్తానని ఓ పి ఎస్  అమలు చేస్తానని  కాళీ పోస్టులు భర్తీ చేస్తా అని కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులకు రెగ్యులర్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వాటిపైన ఏమాత్రం చర్చించక పోవడం కార్మికులపై నిరుద్యోగులపై యువకులపై ఏమాత్రము ఆదర అభిమానాలు లేవని తెలిపారు కేంద్ర ప్రభుత్వము పెంచుతున్న వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ కరెంట్ చార్జీలు ఆస్తి పన్ను రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం అందుకు వ్యతిరేకంగా పోరాడుతావని పిలిపి పోవడము ఆయా వర్గాల్లో ఆందోళన కలిగిస్తుందని రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలాగే దుల్హన్ పథకం అమలు చేయడం ముస్లిం సమాజము పోరాటాలకు సంసిద్ధమవుతుందని కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర మస్తాన్ ఖాన్ ఆవాజ్ కన్వీనర్ మస్తాన్ వలి  తెలిపారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks