Nandyal

ప్రారంభమైన ఉమ్మడి కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు

ప్రారంభమైన ఉమ్మడి కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు

నంద్యాల (NandyalOnline.com) 09 జూలై:  నంది పైప్స్ బ్యాడ్మింటన్ పోటీలు ఉమ్మడి కర్నూలు జిల్లా అండర్ 11,అండర్,13 మరియు అండర్ 15 బాల బాలికల విభగములలో పోటీలు నంది గ్రూప్ అధినేత సుజల అధ్యక్షతన, నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ అధినేత డా.లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షలు వంశీధర్,మరియు నంది గ్రూపు సి.ఎఫ్.వో రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజల మాట్లాడుతూ ఇటువంటి క్రీడలు నంద్యాల జిల్లాలో జరగడం చాలా మంచి పరిణామం అని అన్నారు అలాగే క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజం కాబట్టి ఓటమిని ఛాలెంజ్ గా తీసుకుని పట్టుదలతో విజయం సాధించాలని కోరారు.డా.లక్ష్మయ్య మాట్లాడుతూ నంది పైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీ నుండి గత రెండు దశాబ్దాలుగా ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ క్రీడకరులు తయారుచేసారని అలాగే ఈ అకాడమీని శ్రీమతి సుజల సారథ్యంలో కొత్త హాంగులతో సింథటిక్ మాట్స్,ఎల్ఈడి లైట్స్ వేసి జాతీయ స్థాయిని తలపించే విధంగా తయారు చేయడం చాలా గొప్ప శుభపరిణామం అన్నారు ఇకా మంచి క్రీడాకారులు తయారుకావలని కోరారు, వంశీధర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లానుండి ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ముస్లిం మైనారిటీ నేత దాల్ మిల్ అమీర్, సాగర్, పి.టి.కృష్ణ మరియు నంది గ్రూప్ జియం మహేశ్వర రెడ్డి, నందిగ్రూప్ సిబ్బంది,బాడ్మింటన్ శిక్షకులు నాగార్జున, రాధాకృష్ణ కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks