Nandyal

నిరాడంబరంగా, శాంతి యుతంగా భక్తి శ్రద్ధలతో ముగిసిన బక్రీద్ పండుగ

నిరాడంబరంగా, శాంతి యుతంగా భక్తి శ్రద్ధలతో ముగిసిన బక్రీద్ పండుగ

నంద్యాల 10 జూలై: నంద్యాలలో బక్రీద్ పండంగ నిరాడంబరంగా, శాంతియుతంగా ముగిసింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం వల్ల ఈ సంవత్సరం ఈద్గాలలో ఈద్ నమాజ్ నిర్వహించలేదు. ఉదయం ఆరున్నర గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు అరవై కు పైగా వివిధ మస్జిద్ లలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈద్ నమాజ్ ఆచరించారు. మస్జిద్ లలో అయా ఇమాములు ఈద్ నమాజ్ నిర్వహించారు.జామియా మస్జిద్ లో హాఫిజ్ ఇర్ఫాన్, ఫుర్ఖాన్ మస్జిద్ లో హాఫీజ్ హాది, ఖసాబ్ మస్జిద్ లో హాఫీజ్ ఇసాక్, మాల్దార్ పేట్ లో హాఫీజ్ ఫైరోజ్,  ఖిజర్ మస్జిద్ లో మునవ్వర్, కుబ్రా మస్జిద్ లో హాఫీజ్ అమ్జద్ బాషా సిద్దీఖీ, మస్జిద్ రసూల్ లో హాఫీజ్ ముహమ్మద్ సలీం, నూరానీ మస్జిద్ లో మౌలానా అబ్దుల్లా బాఖవి, సిద్దీఖీ మస్జిద్ లో హాఫీజ్ ముహమ్మద్ ఆజం నమాజ్ చేయించారు.ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించమని ప్రార్థిచారు.

Back to top button
Enable Notifications    OK No thanks