Nandyal

డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ క్షేత్రస్థాయి సిబ్బంది శిక్షణ కార్యక్రమం

డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ క్షేత్రస్థాయి సిబ్బంది శిక్షణ కార్యక్రమం

 

నంద్యాల జులై 27 (Nandyalonline) స్థానిక నంద్యాల పట్టణంలోని నంద్యాల జిల్లా ఆసుపత్రి నందు సచివాలయ ఆరోగ్య  సిబ్బంది ఏఎన్ఎం లు మరియు ఎమ్.ఎల్. హెచ్.పి. లకు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పై శిక్షణ కార్యక్రమం శిక్షణ కార్యక్రమం అర్బన్ మరియు రూరల్ వారికి 27.07.22 వ తేదీ బుధవారం నాడు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన వారు నంద్యాల జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ శేషారత్న, మరియు టీం లీడర్ కీర్తి ఆరోగ్య మిత్రాలు సంపత్, మనోహర్ రావు , రామస్వామి, మనోహర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అవగాహన సదస్సు శిక్షణ తరగతుల్లో భాగంగా ఆరోగ్యశ్రీ లో ఏ జబ్బులు ఉంటాయి, అలాంటి జబ్బులకు ఏ హాస్పిటల్లో చికిత్స అందజేస్తారు, ఆ పేషెంట్ యొక్క బాగోగులు చూసుకోవడానికి ఆరోగ్య మిత్రగా సచివాలయ ఏ.ఎన్.ఎం.లు ఏ విధంగా పనిచేయాలి అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఇంకా ఆరోగ్య ఆసరా, పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. అనే విషయం గురించి  పూర్తి అవగాహన తెలియజేయడానికి అర్బన్ మరియు రూరల్ సచివాలయ ఏ.ఎన్.ఎం. లకు ఎం.ఎల్. హెచ్.పి లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలు మరియు రూరల్ ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks