
Nandyal
డాక్టరేట్ నూర్ బాషా గారిని సన్మానించిన పాపులర్ ఫ్రంట్
డాక్టరేట్ నూర్ బాషా గారిని సన్మానించిన పాపులర్ ఫ్రంట్
నంద్యాలకు చెందిన యువకుడు నూర్ బాషా క్యాన్సర్ నివారణకై చేసిన పరిశోధనకు గాను ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డాక్టరేటు ప్రదానం చేసిన సందర్భంగా నూర్ బాషాని కలిసి శుభాకంక్షలు తెలిపి సన్మానించిన పాపులర్ ఫ్రంట్ నంద్యాల డివిజన్ ప్రెసిడెంట్ ఏజాస్ హుస్సేన్ మరియు కమిటీ సభ్యులు. ఏజాస్ హుస్సేన్ మాట్లాడుతూ నూర్ బాషా తండ్రి నజీర్ హుస్సేన్ నంద్యాలలోని టెక్కెపోలీస్ లైన్ మసీదులో మౌజన్ గా పని చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నూర్ బాష పట్టుదల, ఆత్మస్థైర్యంతో కెరీర్ లో విజయం దిశగా అడుగులు వేయాలని, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రిద్వాన్ ఆలం, షఫీ వుళ్ల, శైక్షవలి, పాల్గొన్నారు.