
జొయ ఉర్దూ కోచింగ్ ఆధ్వర్యంలో ఉచిత టెట్ శిక్షణ తరగతుల ను తనిఖీ చేసిన CEDM అసోసియేట్ డైరెక్టర్ ఎండి. మూనీర్.
జొయ ఉర్దూ కోచింగ్ ఆధ్వర్యంలో ఉచిత టెట్ శిక్షణ తరగతుల ను తనిఖీ చేసిన CEDM అసోసియేట్ డైరెక్టర్ ఎండి. మూనీర్.
నంద్యాల (NandyalOnline.Com) 8 జూలై: సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) తరుపున జొయ ఉర్దూ కోచింగ్ ఆధ్వర్యంలో స్థానిక ఉర్దూ భవన్ లో మైనారిటీ ఉర్దూ విద్యార్థుల కొరకు నిర్వహిస్తున్న ఉర్దూ టెట్ శిక్షణ తరగతుల ను CEDM అసోసియేట్ డైరెక్టర్ ఎండి. మూనీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో ఉర్దూ ను రెండువ అధికార భాషా గా అమలు చేయడం వల్ల ఉర్దూ భాష అభివృద్ధికి, మైనారిటీ ఉర్దూ విద్యార్థుల విద్య భవిష్యత్తు కొరకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో CEDM తరుపున ఉర్దూ మాధ్యమం లో టెట్_22 రాస్తున్న మైనారిటీ విద్యార్థులకు జొయ ఉర్దూ కోచింగ్ ఆధ్వర్యంలో 40 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉచిత శిక్షణ తరగతుల లో 152 విద్యార్థుల కు జొయ ఉర్దూ కోచింగ్ డైరెక్టర్ సి. అబ్దుల్ సత్తార్ పరిరక్షణ లో సక్రమం గా శిక్షణ కార్యక్రమం జరుగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు త్వరలో ఉచితము గా టెట్ మెటీరియల్ అందచేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జొయ ఉర్దూ కోచింగ్ కొ డైరెక్టర్ ఫజ్లూర్ రహమాన్, కొ. ఆర్డీనెటర్స ఆంజద్ షరీఫ్, అబ్దుల్ అజీజ్ ،బోధన సభ్యులు షమీమ్ బాను, వకీల్ అహ్మద్, రీయీజ్, హూసెన్ బాష ،పాల్గొన్నారు.