
Nandyal
జామన్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఈద్ ముబారక్ ముశాయరా
జామన్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఈద్ ముబారక్ ముశాయరా
నంద్యాల 14 జూలై: ఈదుల్ అజా (బక్రీద్) సందర్భంగా శనివారం 16 జూలై ఉర్దూ భాష అభివృద్ధి మరియు ఉర్దూ భాష తియ్యదనం అందరికి అందించాలని సదుద్దేషంతో మునిసిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న సాహెబ్ మస్జిద్ మకాన్ ఆవరణలో జామన్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఈద్ ముబారక్ ముశాయరా నిర్వహించనున్నారు. ఈ ముశాయరా లో హైదరాబాద్, కడప, కర్నూలు మరియు సంద్యాల కు చెందిన ప్రముఖ ఉర్దూ భాష కవులు పాల్గొని “నాతియా మరియు గైర్ తర్వా” కవిత్వం వినిపిస్తారు. కనుక ఉర్దూ భాష కవులు, ఉర్దూ ఉపాధ్యాయులు, ఉర్దూ భాష ప్రియులు మరియు అభిమానులు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు.
