
జగనన్న విదేశీ విద్యా దీవెన అద్భుతం
- జగనన్న విదేశీ విద్యా దీవెన అద్భుతం
- విదేశీ విద్య దీవెన పథకం దేశంలో ఇదే తొలిసారి
- గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్
నంద్యాల 12 జూలై: రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంలో పోటీపడేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోవడం అద్భుతమని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని తన జిపిఎస్ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.
రాజు నాయక్ మాట్లాడుతూ
దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆరటపడుతున్న ముఖ్యమంత్రి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పేద గిరిజన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పీజీ, పీహెచ్డీ, ఎంబిబిఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్య దీవెన పథకంతో మేలు చేకూర్చేలా సీఎం జగన్ నిర్ణయం హర్షనీయమన్నారు. ఉన్నత చదువులు నోచుకోలేక ఎంతోమంది గిరిజన విద్యార్థులు మధ్యలోనే చదువును ఆపేసి కూలి పనులు చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం విద్యార్థులకు వరంగా మారుతుందని అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డికి అన్ని వర్గాలతో పాటు గిరిజనులు కూడా రుణపడి ఉంటారని సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాల నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, జిపిఎస్ యువజన యూత్ నాయకులు విక్రమ్ నాయక్, రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు