
Nandyal
కలెక్టరేట్ లో 11న స్పందన కార్యక్రమం: కలెక్టర్
కలెక్టరేట్ లో 11న స్పందన కార్యక్రమం: కలెక్టర్
నంద్యాల జిల్లాలో సోమవారం “స్పందన” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జీలానీ సమూన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి సోమవారం ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరుకావాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేయాలన్నారు.