Nandyal

ఉర్దూ సాహిత్య కమిటీ “కార్వానె ఉర్దూ” ఆధ్వర్యంలో అలరించీన ఉర్దూ కవి సమ్మేళనం

ఉర్దూ సాహిత్య కమిటీ “కార్వానె ఉర్దూ” ఆధ్వర్యంలో అలరించీన ఉర్దూ కవి సమ్మేళనం

 

నంద్యాల (NandyalOnline.com) 24 జూలై: ఉర్దూ సాహిత్య కమిటీ” కార్వానె ఉర్దూ “జిల్లా కన్వీనర్ సి. అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యం లో స్థానిక ఉర్దూ భవన్ లో ఉర్దూ కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఎపి ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డా.నౌమాన్, ఇతర అతిథులు గా జొయ ఉర్దూ కోచింగ్ డైరెక్టర్ సి. అబ్దుల్ సత్తార్, మునిసిపల్  కొ.ఆప్షన్ మెంబర్ సలాముల్లాహ, కార్పొరేటర్ తమీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. నౌమాన్  మాట్లాడుతూ ఉర్దూ భాషా అభివృద్ధి కి  ఉర్దూ కల్చర్ ను తెలియ పరుచటకు కవి సమ్మేళనం దౌహద పడుతాయన్నారు. కవి సమ్మేళనం లో ఉర్దూ విద్యార్థులు పాల్గొని కవితలు వినిపించడం అభినందనీయం అన్నారు. ఉర్దూ భాష అభివృద్ధికి తమ వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపల్ కొ. ఆప్షన్ మెంబర్ సలాముల్లాహ మాట్లాడుతూ ఉర్దూ భాష ముస్లింల భాష మాత్రమె కాదు రాజ్యాంగ పరం గా అందరి భాష అన్నారు. కొత్తగా ఏర్పాటు అయినా నంద్యాల జిల్లాలో కార్వానె ఉర్దూ ఆధ్వర్యంలో చేస్తున్న ఉర్దూ సేవలు అభినందనీయమని అన్నారు. జొయ ఉర్దూ కోచింగ్ డైరెక్టర్ సి. అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఉర్దూ భాష మన దేశంలో మాత్రమె కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భాష గా అభివర్ణించారు. కార్పొరేటర్ తమీమ్ మాట్లాడుతూ ఉర్దూ విద్యార్థుల కు విద్య పరం గానే కాకుండా కల్చరల్ ప్రోగ్రాంలలొ పాల్గొనటకు కృషి చేస్తున్న కార్వానె ఉర్దూ కన్వీనర్ సి. అబ్దుల్ అజీజ్ గారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రముఖ ఉర్దూ కవులు, ఫఖీర్ అహ్మద్, షోయబ్జమాన్, తస్లీమ్, ఫెరొజ్ షా సిద్ధిఖీ, అస్మ, నజ్మ, సుమయ్య, ఫైరొజ, ఖుతీజతూల్ కుబ్ర, రెశ్మ తదితరులు తమ కవితలతో అలరించారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ న్యాయవాది రవి కార్వానె ఉర్దూ కొ. కన్వీనర్స్ ఫఖీర్ అహ్మద్, షోయబ్జమాన్, ఆర్గానజీంగ్ సెక్రటేరిస్ నవాజ్ బాష, ఎండి. ఇక్బాల్, ఎపి ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks