Nandyal

అంజుమన్ ఆధ్వర్యంలో ఏడు జంటలకు సామూహిక వివాహం, ఒక్కో వధువుకు నలభై వేల నగదు చేక్కు బహుకరణ.

అంజుమన్ ఆధ్వర్యంలో ఏడు జంటలకు సామూహిక వివాహం, ఒక్కో వధువుకు నలభై వేల నగదు చేక్కు బహుకరణ.

నంద్యాల 14 జూలై:  అంజుమన్ ఆధ్వర్యంలో ఏడు జంటలకు స్థానిక అంజుమన్ షాది ఖానాలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. అంజుమన్ అధ్యక్షులు హాజి నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ అధ్యక్షుతన జరిగిన ఈ కార్యక్రమంలో జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్, ఇమాముల సంఘం అధ్యక్షులు హాఫీజ్ అమ్జద్ బాషా సిద్ధీఖ్, అంజుమన్ ఉపాధ్యక్షులు సి.అబ్దుల్ హఖ్, ఎగ్బాల్, మున్నా వధువరుల బంధువులు పాల్గొన్నారు.  ఈ సంధర్భంగా ‌ఖుద్దూస్ మాట్లాడుతూ అంజుమన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు ఎన్ని వచ్చిన చేస్తామని, పేద ముస్లిములు నంద్యాలకు చెందిన వారు ముందుకు రావాలని, ప్రతి వధువుకు కానుకగా నలభై వేల నగదు చెక్కు ఇవ్వడం జరుగుతుందన్నారు. సమద్ మాట్లాడుతూ పేద వధువుకు రూ. 40,000/- ఇస్తుంన్నందుకు నంద్యాల ముస్లిం సమాజం తరుపున అంజుమన్ సంస్థను అభినందించారు. పేద ముస్లింలు సామూహిక వివాహాలు అంజుమన్ లో చేసుకునేందుకు ఎలాంటి న్యూనత చెంద కూడదని అంజుమన్ అందరిది, పెద్దల ముందు వివాహం చేసుకొనుటకు ముందుకు రావాలని అభ్యర్ధించారు. రాష్ట్రంలో ఎక్కడి లేని విధంగా, ప్రభుత్వం సైతం ఇవ్వలేని ఈ తరుణంలో నంద్యాల ఆంజుమన్ పేద దుల్హన్ కు నలభై వేలు ఇవ్వటం, ఇంకా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం అభిలషణీయం అన్నారు. అమ్జద్ మాట్లాడుతూ పేదలు పెండ్లీలకు మజీదుల వెంట తిరుగక అంజుమన్ గడిప తొక్కాలన్నారు. నాలుగు జంటలు వస్తె ఎపుడైనా వివాహాలు జరుపుతారని తెలిపారు.  మౌలానా అబ్దుల్లా ఖాజీగా నిఖా నిర్వహించి ప్రార్థన చేసారు. అనంతరం వధువులకు చెక్కులు పంపిణి చేసారు.

YouTube player

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks